ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్మిక హక్కుల కోసం పోరాటం

ABN, Publish Date - May 02 , 2025 | 12:29 AM

కార్మికుల హక్కుల కోసం పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పిలుపునిచ్చారు.

కర్నూలులో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం, సీఐటీయూ నాయకులు

సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య

ఘనంగా మేడే వేడుకలు

కర్నూలు న్యూసిటీ, మే 1(ఆంధ్రజ్యోతి): కార్మికుల హక్కుల కోసం పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీపీఐ జిల్లా సమితి కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బి.గిడ్డయ్య జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, డి.శ్రీనివాసరావు, ఏఐవైఐఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీని వాసులు, బీసన్న, నాగరాజు, శ్రావణి రెడ్డి పాల్గొన్నారు.

ఫ 8 గంటల పని విధానాన్ని కాపాడుకునేందుకు, లేబర్‌ కోడ్లను రద్దు చేసేందుకు కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలాని ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌.మునెప్ప పిలుపునిచ్చారు. మేడేను పురస్క రించుకుని నగరంలో ఆటో, హమాలీ, మెడికల్‌, ఆర్టీసీ, ఏపీ టూరిజం, విద్యుత రంగ కార్మికులు ఏఐటీయూసీ అధ్వర్యంలో జెండాలను ఎగుర వేసి స్థానిక రైల్వే స్టేషన నుంచి ఏఐటీయూసీ కార్యాలయం వరకు ఆటో కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రక టించిన వాగ్దానాలు ఇప్పటికి అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి.చం ద్రశేఖర్‌, టి.రామాం జనేయులు, కిట్టు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నల్లన్న, డీసీ.రహిమాన పాల్గొన్నారు.

ఫ సీఐటీయూ పాతబస్తీ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, రామాంజ నేయులు, అబ్దుల్‌ దేశాయ్‌, మైమూద్‌ పాల్గొన్నారు.

కర్నూలు అర్బన: కార్మికులకు అండగా టీఎనటీయూసీ సేవలు అందిస్తుందని కుడా చైర్మన, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం నగరంలో టీఎనటీయూసీ కార్యా లయంలో మే డే వేడుకలు జిల్లా అధ్యక్షులు వై.నరసింహులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌ అధ్వర్యంలో జరిగాయి. రాష్ట్ర నాయకురాలు సి.అరుణకుమారి, టీడీపీ సీనియర్‌ నాయకులు గౌరు వెంకటరెడ్డి హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో మోహనరావు, సత్రం రామకృష్ణుడు, రామక్రిష్ణ, గోపవరం నాయుడు, సలాం, దివాకర్‌ ఉమ్మర్‌ బాషా, మాధవరాజుపాల్గొన్నారు.

ఓర్వకల్లు: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి కార్మికుల హక్కులను కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు డు రామకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కేతవరం, ఓర్వ కల్లు, నన్నూరు, శకునాల, హుశేనాపురం, ఉయ్యాలవాడ గ్రామాల్లో మే డేను ఘనంగా నిర్వహించారు. కేతవరంలో రామకృష్ణ జెండాను ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి నాగన్న, నాయకులు షాజహాన, శ్రీధర్‌, చంద్రబాబు నాయుడు, సుధాకర్‌, చాంద్‌బాషా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కోడుమూరు: పట్టణంలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం మే డేను ఘనంగా నిర్వహించారు. పాతబస్టాండ్‌ నుంచి కొత్త బస్టాండ్‌ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో ఎర్ర జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సుభాన్‌, గఫూర్‌మియా, లక్ష్మన్న, వీరన్న, కుమారస్వామి, కార్మికులు మధు, మద్దిలేటి, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు మునిస్వామి, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గూడూరు: మండలంలోని గూడూరు, కె.నాగులాపురం గ్రామాల్లో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం గూడూరు పట్టణంలో సీఐటీయూ కార్యాలయం ముందు జెండాను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ, అలాగే హమాలీ సంఘం ఏర్పాటు చేసిన జెండాను సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే.మోహన ఆవిష్క రించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షుడు గుంటప్ప, హమాలీలు, అంగనవాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

కల్లూరు: కల్లూరు మండలం, అర్బన ప్రాంతాల్లో వామపక్ష, వివిధ కార్మిక సంఘాల నాయకులు గురువారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరిం చారు. ఈసంద ర్భంగా నాయకులు సీహెచ.సాయిబాబా, సుధాకరప్ప, జి.రామకృష్ణ, మధు, కృష్ణలు మాట్లాడుతూ మే డే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపుని చ్చారు. కల్లూరు మండలం ముజఫర్‌నగర్‌, కృష్ణానగర్‌, శరీననగర్‌, ఇండస్ర్టీయల్‌ ఎస్టేట్‌లలో వామపక్ష, కార్మికసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

కర్నూలు హాస్పిటల్‌: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం యూనియన ఆఫీసులో ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ సింధూ సుబ్రహ్మణ్యం పాలొ ్గన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మునెప్ప, ఏపీ మెడికల్‌ ఎం ప్లాయీస్‌ యూనియన రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలు స్వామి నాయక్‌ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించిన ఈ హక్కు లను కాపాడేందుకు ఐక్యంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సెక్ర టరీ ఖాజాముద్దీన, ట్రెజరర్‌ సురేష్‌, సర్జెంట్‌ ఉరుకుందయ్య, హెల్త్‌ ఇన్స౅ పక్టర్‌ టి.గోవిందు స్వామి, హరిశ్చంద్ర నాయుడు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:29 AM