విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభం
ABN, Publish Date - May 02 , 2025 | 01:33 AM
మండలంలోని నల్లకాలువ గ్రామంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గణపతి, సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ, శ్రీదేవి భూదేవి సహిత చెన్న కేశవ స్వామి ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం మొదటిరోజైన గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఆత్మకూరు రూరల్, మే 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నల్లకాలువ గ్రామంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గణపతి, సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ, శ్రీదేవి భూదేవి సహిత చెన్న కేశవ స్వామి ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం మొదటిరోజైన గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రతిష్ఠాపనోత్సవంలో భాగంగా గురు వారం వేద పండితుల ఆధ్వర్యంలో గోపూజ, గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, కంకణ ధారణం, పుణ్యాహ వచనం, గణపతి హోమంను భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే శుక్రవారం మహాస్నపనం, 108 కలశాలతో అభిషేకం, ప్రధాన హోమాల అనంతరం సాయంత్రం గ్రామంలో గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం దీక్షాహోమం అనంతరం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష, ధ్వజ స్థంభ ప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 3వ తేది విగ్రహ ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
Updated Date - May 02 , 2025 | 01:33 AM