వారంలో శ్రీశైలం గేట్ల ఎత్తివేత..?
ABN, Publish Date - Jul 04 , 2025 | 11:39 PM
ఎగువ నుం చి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయం మరో వారం రోజుల్లో నిండు తుందని, జూలై 12వ తేదిలోపు గేట్లు ఎత్తే అవకా శం ఉన్నట్లు తెలుస్తోంది.
వారంలో జలాశయం నిండవచ్చని అధికారుల అంచనా
ఎగువన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
నంద్యాల, జూలై4(ఆంధ్రజ్యోతి): ఎగువ నుం చి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయం మరో వారం రోజుల్లో నిండు తుందని, జూలై 12వ తేదిలోపు గేట్లు ఎత్తే అవకా శం ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి, తుంగభద్ర, కృష్ణా ఉపనది భీమాపై ఉన్న ఉజ్జయిని రిజర్వాయర్లకు ఆదివారం నుంచి భారీగా వరద చేరుతుందని అధి కారుల అంచనా. కేంద్ర జలసంఘం సూచనల మేర కు ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల్లోకి వచ్చి చేరు తున్న వరద కంటే ఎక్కువ నీటిని దిగువన శ్రీశైలా నికి విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో కృష్ణ నది ఆరంభమయ్యే సతారా జిల్లాతో పాటు సాంగ్లీ, కొ ల్లాపూర్(మధ్య మహారాష్ట్ర) జిల్లాల్లో రాబోయే వా రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆల్మట్టికి 95వేల క్యూసెక్కులు..
ప్రస్తుతం ఆల్మట్టికి 95 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపుర డ్యాంకు లక్ష క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలిపెడుతున్నారు.
శ్రీశైలానికి....
ప్రస్తుతం శ్రీశైలానికి 77వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. కుడి, ఎడమ జల విద్యుత్పాదన కేంద్రా లను పూర్థిస్థాయిలో నడుపుతున్నారు. వీటి ద్వారా ప్రస్తుతం 68వేల క్యూసెక్కుల నీరు నాగార్జునసా గర్‌లోకి చేరుతోంది. 215 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో ప్రస్తుతం నీటి లభ్యత. 170 టీఎంసీలు. మరో 30టీఎంసీలు చేరితే ప్రాజెక్టు గేట్లను తెరుస్తారు.
తుంగభద్రలో 75శాతం...
100టీఎంసీల కెపాసిటీ ఉన్న తుంగభద్ర రిజర్వా యర్ 75శాతం నిండింది. జలాశయం నుంచి 55 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వచ్చే ఆదివారం ఉదయానికి శ్రీశైలం ఇన్‌ఫ్లో లక్షా యాభై వేల క్యూసెక్కులు దాటే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ డ్యాం ఇప్పటికే సగం నిండింది.
Updated Date - Jul 04 , 2025 | 11:39 PM