శ్రీమఠం హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:14 AM
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి శ్రీమఠం హుండీ ఆదాయం రూ.4,05,95,395 నగదు వచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు.
మంత్రాలయం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి శ్రీమఠం హుండీ ఆదాయం రూ.4,05,95,395 నగదు వచ్చినట్లు మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్ జోషి, సురేష్ కోణాపూర్ తెలిపారు. మంగళవారం 32 రోజుల హుండీని మఠం గురురాజాంగణ భవనంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించారు. రూ.4,05,95,395 నగదుతో పాటు 1.495 కేజీల వెండి, 116 గ్రాములు బంగారు, వివిధ దేశాల డాలర్లు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన నగదును శ్రీమఠం బ్యాంకు ఖాతాకు జమచేసినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో సూపరింటెండెంట్ అనంతపురాణిక్, రవికులకర్ణి, కృష్ణమూర్తి, గోపి, కరణం రాఘవేంద్ర, గిరిధర్, సుజ్ఞానేంద్ర, శ్రీపాదాచార్‌తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 23 , 2025 | 12:14 AM