గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి
ABN, Publish Date - May 22 , 2025 | 12:33 AM
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తామని హౌసింగ్ పీడీ చిరంజీవి అన్నారు.
హౌసింగ్ పీడీ చిరంజీవి
తుగ్గలి, మే 21 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తామని హౌసింగ్ పీడీ చిరంజీవి అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. గృహ నిర్మాణం కోసం దరఖాస్తులను తనిఖీ చేసి, అర్హులైన లబ్ధిదారుల గృహాలను మాత్రమే ఆన్‌లైన్ చేయాలన్నారు. ఇంజనీ రింగ్ అసిస్టెంట్లు తమ సచివాలయ పరిధిలో దరఖాస్తులను పరిశీలించి, అనీన సక్రమంగా ఉంటేనే ఆన్‌లైన్ చేసి బిల్లులు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో విశ్వమోహన్, హౌసింగ్ డీఈ విజయ కుమార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:34 AM