పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:01 AM
నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నీటి సమస్య తలెత్తకుండా చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో కర్నూలు నగరపాలక సంస్థ ఎస్‌ఈ రాజశేఖర్, ఎంహెచ్‌ఓ విశ్వేశ్వరరెడ్డి, సిటీ స్లానర్, ఏఈలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసే అధికారులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో పింఛన్ల పంపిణీపై ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్ పంపిణీ అధికారులు అవినీతికి పాల్పడినట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Updated Date - Apr 30 , 2025 | 12:01 AM