అర్జీలు త్వరగా పరిష్కరించండి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:56 PM
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహించారు.
ఆదోని, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం- పీజీఆర్‌ఎస్ లో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచాలని సూచిం చారు. మండలంలోని సంబంధిత శాఖల అధికారులకు సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితు ల్లోనూ బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యల్లో కొన్ని..
తన భర్త మరణిం చారని, ఆయన పేరుపై ఉన్న 847లో నమోదైన రెండు ఎకరాల భూమిని తన పేరుపై ఆన్‌లైన్‌లో మార్చాలని గొనెగండ్ల మండలం చిన్నమర్రి వీడు గ్రామానికి చెందిన పి.రోజ అర్జీ సమర్పించారు.
తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, చిన్న కుమార్తె ప్రతిభ 5వ తరగతి ప్రవేశ పరీక్ష రాయగా, 4990 ర్యాంకు వచ్చిందని, సీటు ఇప్పించాలని నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన సంసోను అర్జీ సమర్పించారు.
జింకల పార్కు ఏర్పాటు చేసి పొలా లను కాపాడాలని రైతు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మల్లయ్య, అయ్యప్ప అర్జీ సమర్పించారు. డీఎల్‌డీవో బాలకృష్ణా రెడ్డి, డీఎల్‌పీవో తిమ్మక్క, డీఐ ఆఫ్ సర్వే యర్ వేణుసూర్య, శ్రీనివాసరాజు, ఆర్టీసీ డీఎం మహ్మద్ రఫీ, బాలవర్ధిరాజు, ఏవో రమాదేవి, డీటీలు బాబు, రుద్రగౌడ్ పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 11:56 PM