ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలను సత్వరమే పరిష్కరించండి

ABN, Publish Date - Jun 02 , 2025 | 11:40 PM

ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టం- పీజీఆర్‌ఎస్‌లో మండలాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.

అర్జీ స్వీకరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రసెల్‌ సిస్టం- పీజీఆర్‌ఎస్‌లో మండలాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రస్సెల్‌ సిస్టం- పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏఒక్క ఆధికారి నిర్లక్ష్యం చేయకూడదని, అర్జీదారులను సంతృప్తిపరచాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధఙత శాఖల అధికారులకు తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించాలన్నారు.

మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని

1 సర్వే నెం. 314/ఏ3 లో 0.94 ఎకరాలు కొను గోలు చేశానని, ఆన్‌లైన్‌ లో వేరే వారి పేరు ఉందని, తన పేరు నమో దు చేయాలని ఆదోని మండలం పర్వ తాపురం గ్రామానికి చెందిన అయ్యన్న అర్జీ ఇచ్చారు.

2 తమ గ్రామంలో వీధిలైట్లు లేవని, పారిశుద్యం లోపించిందని పరిష్కరించాలని ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన శంకర్‌ అర్జీ సమర్పించుకున్నారు.

3 తన కూతురు మహేశ్వరి పుట్టుకతోనే మూగ, చెవిటి మతిస్థిమితం లేదని, దివ్యాంగుల పింఛన్‌ మంజూరు చేయాలని ఆదోని పట్టణం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన నారాయణ అర్జీ సమర్పించుకున్నారు.

4 పట్టణంలో వెంకటేశ్వర ఆలయం నుంచి బసవేశ్వర సర్కిల్‌ వరకు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు దీపక్‌, ప్రకాష్‌, అర్జీ సమర్పించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో వసుంధర, డిప్యూటీ ఇన్స్పెక్టర్‌ సర్వేయర్స్‌ వేణు సూర్య, శ్రీనివాసరాజు, డీఎల్‌డీవో రమణ రెడ్డి, డీఎల్‌పీవో నూర్జహాన్‌, ఇరిగేషన్‌ డిప్యూటీ ఇంజనీర్‌ షఫీ ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్‌ ఈఈ పద్మజ, ఆర్‌టీసీ డీఎం మహ్మద్‌ రఫీ, డిప్యూటీ డీఎంహెచ్‌వ్వో సత్వవతి, ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు, ఉప తహసీల్దార్‌ వలిబాషా పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:40 PM