స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:00 AM
స్మార్ట్ మీటర్లను రద్దు చేయా లని సీపీఎం మండల కార్యదర్శి ఏ.కృష్ణ, బి.మధు డిమాండ్ చేశారు.
విద్యుత ఏఈకి సీపీఎం నాయకుల వినతి
కల్లూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): స్మార్ట్ మీటర్లను రద్దు చేయా లని సీపీఎం మండల కార్యదర్శి ఏ.కృష్ణ, బి.మధు డిమాండ్ చేశారు. మంగళవారం కల్లూరు మండల సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో విద్యుత ఏఈ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భం గా వారు మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు జగన ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే పగలగొట్టండి అని పిలుపునిచ్చిన నారా లోకేశ అధికారంలోకి రాగానే మీటర్లు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాది కాలంలోనే దాదాపు రూ.15వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తున్నా యన్నారు. కార్యక్రమంలో పందిపాడు శ్రీనివాసులు, పెద్దపాడు గోపి, యేసురాజు పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 01:00 AM