ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రావణం.. పరమపవిత్రం...

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:50 PM

తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావించే ‘శ్రావణ మాసం’ శుక్రవారం ప్రారంభమవుతోంది.

ఆధ్యాత్మిక భావాలకు నెలవు

సంప్రదాయాలకు కొలువు

నేటి నుంచి ‘శ్రావణ మాసం’ ఆరంభం

కర్నూలు కల్చరల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావించే ‘శ్రావణ మాసం’ శుక్రవారం ప్రారంభమవుతోంది. ఆషాఢ మాసం సందర్భంగా నెలరోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉన్న ఉమ్మడి జిల్లా వాసులు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతరత్రా శుభకార్యాలకు ఈ మాసంలో శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు ఆయా ప్రాంతాల్లోని దేవాలయాల్లో, ఉమ్మడి జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో శ్రావణ మాసం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో జిల్లాలో యాత్రికుల సందడి కూడా బాగా పెరగనుంది. శ్రావణమాసం ప్రత్యేకించి మహిళలకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసం ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తిభావుకత అంశాలతో ముడిపడి ఉండటంతో పాటు వివాహ, గృహ ప్రవేశ, గృహ నిర్మాణ, నామకరణ మహోత్సవాల వంటి అనేక శుభకార్యాలకు విడిదిగా నిలుస్తోంది. పెళ్లి సంబంధాల నిర్ణయానికి, పెళ్లిళ్ల నిర్వహణకు అనువైన మాసం కావడంతో మాసారంభం కోసం అన్నివర్గాల వారు ఎదురు చూస్తుంటారు. ఆషాఢ మాసం గురువారంతో ముగిసిపోగా శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది.

శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు పెళ్లయిన, పెళ్లికాని ఆడవాళ్లకి ఎంతో ముఖ్యమైన వారాలుగా భావిస్తారు. ఈ ఏడాది ఈ మాసంలో ఐదు శుక్రవారాలు విచ్చేస్తున్నాయి. శ్రావణ మాసం శుక్రవారం రోజున ప్రారంభమవు తోంది. ఇందులో 2వ శుక్రవారం చాలా ముఖ్యమైంది. అది శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆరోజే ’వరలక్ష్మి వ్రతం’ చేస్తారు. ఇది ముఖ్యంగా పెళ్లయిన ముత్తైదువులు చేసుకుంటారు. ఈ వ్రతం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు అందుకుని సకల సిరిసంపదలు, పుత్ర పౌత్రభివృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. శ్రావణ మంగళవారాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. దీనికి శ్రావణ మంగళవారం నోము ఉంటుంది. ఇది ఆచరిస్తే సౌభాగ్యవంతులు అవుతారని నమ్మకం. శ్రావణ మాసంలోని మంగళవారాల్లో చేసే ’మంగళ గౌరీ’ వ్రతాలను గౌరీ నోములని కూడా అంటారు. ఈ వ్రతాలు చేస్తే వరలక్ష్మీ కటాక్షం, మంగళగౌరీ కటాక్షం కలుగుతాయని మహిళలు వీటిని ఆచరిస్తారు.

ఉమ్మడి జిల్లాలో శ్రావణ శోభ

ఉమ్మడి జిల్లాలో శ్రావణ మాసాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. శ్రీశైలం, మహానంది, మంత్రాలయం, అహోబిలం, యాగంటి, తదితర సుప్రసిద్ధ దేవాయాలు, అనేక ధార్మిక కేంద్రాలకు నిలయంగా ఉన్న జిల్లాలో శ్రావణ మాసంలో భక్తుల సందడి కనిపిస్తోంది. శివకేశవులకు నెలవైన మాసం కావడంతో అన్ని వర్గాల భక్తులు తమ ఆరాధ్య దైవాలను పూజించేందుకు తరలివస్తారు. ఈ మాసం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. పెళ్లిళ్లు, వ్రతాలు, పూజలు, శుభకార్యాల వంటి వాటితో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు. సోమవారాల్లో శివునికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారాల్లో షిరిడి సాయి, సత్యసా యి పూజలు, గురుదేవుని ఆరాధనలు, శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు, శనివారాల్లో తిరుమలేశునికి, హనుమంతునికి, శనీశ్వరుని పూజలు నిర్వహిస్తారు.

శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాస ఉత్సవాలు

నంద్యాల కల్చరల్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శుక్రవారం నుంచి శ్రావణమాస ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, సాధారణ రోజుల్లో స్వామి, అమ్మవార్ల అర్జితసేవలు, అన్నప్రసాదాల వితరణ, పారిశుధ్యం, వాహనాల పార్కింగ్‌ వంటి ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. శ్రావణ మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆది, సోమ వారాలు, వరలక్ష్మీవ్రతం, శ్రావణపౌర్ణమి, మొదలైన రోజుల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో తెలిపారు. మరిన్ని ఆలయంలోని కార్యాలయంలో గాని ఆలయ వెబ్‌సైట్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు.

Updated Date - Jul 24 , 2025 | 11:50 PM