ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
ABN, Publish Date - May 20 , 2025 | 11:58 PM
నెల రోజులుగా ఇళ్ల నిర్మాణాల్లో జీరో పనితీరు కనబరిచిన 185 మంది ఇంజనీరింగ్ అసి స్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని కలెక్టర్ రంజిత్ బాషా హౌసింగ్ పీడీని ఆదేశించారు.
నిర్దేశిత గడువు లోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలి
పురోగతి చూపకపోతే కఠినచర్యలు తప్పవు
కలెక్టర్ రంజిత్ బాషా
నీటి కుంటల నిర్మాణంపై అసంతృప్తి
కర్నూలు కలెక్టరేట్, మే 20 (ఆంధ్రజ్యోతి): నెల రోజులుగా ఇళ్ల నిర్మాణాల్లో జీరో పనితీరు కనబరిచిన 185 మంది ఇంజనీరింగ్ అసి స్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని కలెక్టర్ రంజిత్ బాషా హౌసింగ్ పీడీని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి హౌసిం గ్, ఉపాధి హామీ, యోగాంధ్ర క్యాంపెయిన్, ప్రభుత్వ సేవలపై ప్రజా భిప్రాయం తదితర అంశాలపై స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ జిల్లాలో జూన్ 12 నాటికి నిర్ధేశించిన లక్ష్యం 11,706 ఇళ్లకు గానూ 6486 ఇళ్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా 52.20శాతం ఇళ్లను పూర్తిచేయాల్సి ఉందన్నారు. నిర్దేశి త గడువులోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని, పురోగతి చూపక పోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.
తనిఖీలు చేయాలని ఆదేశం
వచ్చేనెల నుంచి రేషన్‌కు సంబంధించి తహసీల్దార్లు, ఆర్డీవోలు, సీఎస్‌డీటీలు ఏఎస్‌వోను ప్రతినెల తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశిం చారు. వారానికి 4 సర్వీసుల చొప్పున నెలకు 16 ప్రభుత్వ సర్వీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారన్నారు. పెన్షన్, అన్న క్యాంటీన్, రేషన్, దీపం పథకం-2, ఏపీఎస్‌ఆర్‌టీసీ, పంచాయతీ సేవలు తదితర అంశాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారన్నారు.
జూన్ చివరి నాటికి...
జిల్లాలో 8,500 నీటికుంటలను జూన్ చివరి నాటికి నిర్మించాలని లక్ష్యం కాగా, ఇందులో కూడా ప్రగతి లేదని, 1619 మాత్రమే పూర్త య్యాయని, 2696 గ్రౌండింగ్ అయ్యాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇప్పటివరకు 7,277 శాంక్షన్లు మాత్రమే తీసుకున్నారని, కోడుమూరు, ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, గోనెగండ్ల, మంత్రాలయం, కర్నూలు, కౌతాళం మండలాలు మంజూరు తీసుకోవడంలో కూడా వెనుకబడి ఉన్నారని, వీరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డ్వామా పీడీని ఆదేశిం చారు. వీసీలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, డ్వామా పీడీ వెంకట రమణయ్య, జడ్పీ సీఈవో నాసరరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:58 PM