అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
ABN, Publish Date - May 22 , 2025 | 12:42 AM
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఫిర్యాదుల పరిష్కారంలో పోలీసులు ముందుండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
తుగ్గలి, మద్దికెరలో పర్యటన
తుగ్గలి, మే 21 (ఆంధ్రజ్యోతి): అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఫిర్యాదుల పరిష్కారంలో పోలీసులు ముందుండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బుధవారం జొన్నగిరి, తుగ్గలి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలిం చారు. అనంతరం పోలీసు సిబ్బంది సమస్యలను తెలుసు కుని, పోలీసు క్వార్టర్స్ పరిసరాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో క్రైం రేటు తగ్గించడానికి కృషి చేస్తున్నామని, మహిళా రక్షణ కోసం నిఘా ఉంచామ న్నారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పత్తి కొండ డీఎస్పీ వెంకట్రామయ్య, రూరల్ సీఐ పులిశేఖర్, ఎస్‌ఐలు మల్లికార్జున, కృష్ణమూర్తి ఉన్నారు.
మద్దికెర: సాయంత్రం 7 గంటలకు మద్దికెర పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఎస్‌ఐ విజయ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:42 AM