జీజీహెచలో రెండో గేటు ప్రారంభం
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:50 PM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రెండు ప్రధాన ద్వారం (ఇనగే టు)ను ఇనచార్జి సూపరింటెండెంట్ డి.శ్రీరాములు సోమవారం ప్రారంభించారు.
కర్నూలు హాస్పిటల్, జూన 2(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రెండు ప్రధాన ద్వారం (ఇనగే టు)ను ఇనచార్జి సూపరింటెండెంట్ డి.శ్రీరాములు సోమవారం ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రెండు గేట్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ రెండు గేట్ల వద్ద వాహనాలు, ఆటోలు నిలపకుండా సెక్యూరిటీ గార్డులు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. రోగుల బంధువు లు ఆసుపత్రిలో ఎక్కడపడితే వాహనాలు పార్కింగ్ పెట్టకుండా చర్యలు తీసుకోవా లని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. అనంత రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇనగేటు వద్ద సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వర రావు వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
Updated Date - Jun 02 , 2025 | 11:50 PM