కామేశ్వరీదేవి అమ్మవారికి సారె
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:55 PM
ఆషాఢ మాసం పురస్కరిం చుకొని మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవి అమ్మవారికి బాలాజీ సేవా ట్రస్ట్‌కు చెందిన వందలాది మంది మహిళలు పుట్టింటి పట్టుచీర కార్యక్ర మాన్ని నిర్వహించారు.
మహిళలకు ఘనస్వాగతం పలికిన ఆలయాధికారులు
మహానంది, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ మాసం పురస్కరిం చుకొని మహానంది క్షేత్రంలోని కామేశ్వరీదేవి అమ్మవారికి బాలాజీ సేవా ట్రస్ట్‌కు చెందిన వందలాది మంది మహిళలు పుట్టింటి పట్టుచీర కార్యక్ర మాన్ని నిర్వహించారు. వీరికి క్షేత్ర సమీపంలోని గరుడ నందీశ్వరుని ఆలయం వద్ద ఆదివారం ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, వేదపం డితులు స్వాగతం పలికారు. అనంతరం సేవా సమితి కి చెందిన మహిళలు శోభ యాత్ర నిర్వహిస్తూ భక్తి పారవశ్యంతో కోలాటం, భజనలు చేస్తూ మాడవీధుల ద్వారా ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నారు. కామేశ్వరీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆషాఢం సారెగా పట్టువస్త్రాలను ఆలయ అర్చకులకు అందచేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 11:55 PM