జీతాలు తక్షణమే చెల్లించాలి: ఎస్టీయూ
ABN, Publish Date - Jul 27 , 2025 | 11:47 PM
మే, జూన్ నెలల్లో పదోన్నతులు, బదిలీలు పొందిన ఉపాధ్యాయులకు తక్షణమే జీ తాలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి డిమాండ్ చే శారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మే, జూన్ నెలల్లో పదోన్నతులు, బదిలీలు పొందిన ఉపాధ్యాయులకు తక్షణమే జీ తాలు చెల్లించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి డిమాండ్ చే శారు. నగరంలోని సలాంఖాన్ ఎస్టీయూ భవన్‌లో ఆదివారం ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కార్యదర్శి టీకే జనార్దన్ అఽధ్యక్షతన నిర్వ హించారు. నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో బదిలీలు, పదోన్నతులు జరిగాయని, కొత్తగా మంజూరైన ఉన్నత, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల, పాఠశాలల సహాయకులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులలో నియమితులైన వేలాది మంది ఉపాధ్యాయులకు రెండు నెలలు గడుస్తున్నా జీతాలు చెల్లించ కపోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. 12వ పీఆర్‌సీ కమిషన్, 30 శాతం మధ్యంతర భృతి, 11వ పీఆర్‌సీ బకాయి లను వెంటనే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలను మం జూరు చేయాలని, సరెండర్ లీవుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలన్నారు. 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటీఎస్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు ఇస్మాయిల్ సాహేబ్, అబ్దుల్ రహీం, దేవదాసు, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 11:47 PM