ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అడంగల్‌లో పేరు మార్పునకు రూ.50 వేలు లంచం

ABN, Publish Date - Jul 31 , 2025 | 11:59 PM

వేల రూపాయల వేతనం అందుకుంటున్నా కొందరి అధికారులకు సరిపోవడం లేదు.

సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌ వద్ద లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ డీఎస్పీ సోమన్న, సిబ్బంది

ఏసీబీకి చిక్కిన ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌

రైతు నుంచి రూ.70వేలు డిమాండ్‌

జూపాడుబంగ్లా, జూలై 31 (ఆంధ్రజ్యోతి): వేల రూపాయల వేతనం అందుకుంటున్నా కొందరి అధికారులకు సరిపోవడం లేదు. అధికంగా ఆదాయాన్ని సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకోసం ‘లంచం’ అనే మార్గాన్ని ఎంచుకుని కటకటాలపా లవుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెట్‌గా పనిచేస్తున్న రమేష్‌ అడంగల్‌లో పేరు మార్పు చేసేందుకు రైతు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన రైతు ఈశ్వరయ్య తన తల్లి శంకరమ్మ్లపేరుమీద 80బన్నూరు పొలిమేరలోని సర్వేనంబరులో 568-ఏలో 70సెంట్లు, 568-సీలో 30సెంట్లు మొత్తం ఎకరా పొలం ఉంది. అనుభవంలో శంకరమ్మ ఉన్నాకూడా అదే సర్వేనంబరుకు చెందిన లింగన్న అనే రైతు పొలాన్ని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఆన్‌లైన్‌ అడంగల్‌లో లింగన్న పేరు తీసేయాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. అయితే ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్‌ సదరు రైతు నుంచి రూ.70వేలు లంచం డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనన్న రైతు 50 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ.10వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. తర్వాత జూపాడుబంగ్లాకు వస్తే రూ.40వేలు ఇస్తానని రైతు ఈశ్వరయ్య చెప్పడంతో రమేష్‌ గురువారం ఉదయం అక్కడకు వచ్చాడు. ఈ క్రమంలో ముందుగానే ఏసీబీ అధికారులు సమకూర్చిన రూ.40వేల డబ్బును తీసుకెళ్లిన రైతు... కేజీ రోడ్డులోని ఓ కారులో ఉన్న రమేష్‌కు అందించాడు. అప్పటికే అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు సదరు అధికారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ లంచం వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారన్నది విచారిస్తున్నామన్నారు. రైతు ఈశ్వరయ్య మాట్లాడుతూ ఐదేళ్ల నుంచి ఆన్‌లైన్‌ అడంగల్‌లో ఉన్న లింగన్న పేరు తీసేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నానన్నారు. ఏడాది క్రితం తన తల్లి శంకరమ్మ కూడా చనిపోవడంతో తనపేరుమీద మార్చాలని తిరిగా నన్నారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్వోఆర్‌లో మార్చుకోవాలని జూపాడుబంగ్లా తహసీల్దార్‌ కార్యాలయంలో చెప్పడంతో ఆర్డీఓను కలిశారు. ఈ విషయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేష్‌ రూ.70వేలు డబ్బులు డిమాండ్‌ చేయగా రూ.50 వేలకు బేరం కుదరిం దని, జూలై 23న రూ.10వేలు అడ్వాన్సుగా ఇచ్చానని తెలిపారు. ఈ దాడిలో సీఐలు కృష్ణయ్య, రాజప్రభాకర్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:59 PM