ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రూ. 37.9 లక్షలు స్వాధీనం

ABN, Publish Date - Jul 16 , 2025 | 12:26 AM

కర్నూలు నుంచి బెంగళూరుకు ఇంటర్‌సిటీ ప్రైవేట బస్సులో నంద్యాలకు చెందిన షేక్‌ అన్వర్‌ నుంచి రూ. 37.9 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల జిల్లా డోన్‌ అర్బన్‌ సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు

నగదును చూపుతున్న డోన్‌ అర్బన్‌ సీఐ ఇంతియాజ్‌ బాషా

నంద్యాలకు చెందిన వ్యక్తివిగా గుర్తింపు

డోన్‌ టౌన్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): కర్నూలు నుంచి బెంగళూరుకు ఇంటర్‌సిటీ ప్రైవేట బస్సులో నంద్యాలకు చెందిన షేక్‌ అన్వర్‌ నుంచి రూ. 37.9 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల జిల్లా డోన్‌ అర్బన్‌ సీఐ ఇంతియాజ్‌బాషా తెలిపారు. మంగళవారం డోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఎన్‌హెచ్‌-44 జాతీయ రహదారి మ్యాక్స్‌-4 హోటల్‌ సమీపంలో తనిఖీలు చేస్తుండగా నంద్యాలకు చెందిన షేక్‌ అన్వర్‌ బ్యాగులో ఎటువంటి పత్రాలు లేని నగదును గుర్తించినట్లు తెలిపారు. వ్యాపార నిర్వహణకు సంబంధించిన డబ్బు అని ఆ వ్యక్తి చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేదా ఆధారాలు చూపితే నగదు ఆ వ్యక్తికి అందజేస్తామని, లేకపోతే ఆదాయ పన్ను అధికారులకు అప్పజెప్పుతామని పోలీసులు చెప్పారు. సీఐ రాకేశ్‌, అర్బన్‌ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ మమత ఉన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 12:26 AM