ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నది ఒడ్డున శ్మశానానికి రోడ్డు

ABN, Publish Date - Jun 04 , 2025 | 12:13 AM

మండలంలోని చెట్నహల్లిలో శ్మశానానికి రోడ్డు సమస్య పరిష్కారం కానుంది. ఇందులో భాగంగా కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, తహసీల్దార్‌ ఎస్‌.రవి సమస్యను పరిష్క రించేందుకు నది ఒడ్డున శ్మశానానికి రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టారు.

మృతదేహాన్ని తరలించేందుకు గ్రామస్థుల అవస్థలు(ఫైల్‌)

సమస్య పరిష్కారం దిశగా చర్యలు

రూ.45 లక్షలు మంజూరు

మంత్రాలయం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చెట్నహల్లిలో శ్మశానానికి రోడ్డు సమస్య పరిష్కారం కానుంది. ఇందులో భాగంగా కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, తహసీల్దార్‌ ఎస్‌.రవి సమస్యను పరిష్క రించేందుకు నది ఒడ్డున శ్మశానానికి రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టారు. సర్వే.నెంబర్‌.126లోని 3.54ఎకరాల శ్మశానం రికార్డులో ఉంది. శ్మశాన స్థలానికి, గ్రామానికి 1.5 కిలోమీ టర్ల దూరం ఐదు మీటర్ల వెడల్పుతో రోడ్డు మంజూరుకు నిధులు కేటాయించారు. చెట్నహల్లి గ్రామంలో రూ.45 లక్షలతో రోడ్డు మం జూరు చేశారు. శ్మశాన రోడ్డును పంచాయతీరాజ్‌ డీఈ రంగ స్వామి, ఏఈ మల్లయ్య, ఇంజ నీరింగ్‌ అసిస్టెంట్‌ రంగమ్మ పర్యవే క్షిస్తున్నారు. ఈ రోడ్డు పూర్తయితే.. నది ఒడ్డున ఉన్న శ్మశాన స్థలానికి అనువుగా ఉండేందుకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తరు ుతే.. ఇరువర్గాలకు మేలని అధికారులు అంచనా వేస్తున్నారు.

నాలుగు నెలల నుంచి..

సర్వే.నెంబర్‌ 113లోని 1.42ఎకరాల్లో రస్తాలో కొన్నేళ్లుగా శ్మశానాన్ని అన్నికులాల వారు ఉపయోగించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆశ్మశానం పక్కనే దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించగా వారు అక్కడ ఇళ్లు నిర్మించు కున్నారు. దీంతో శ్మశానంలోని మృతదేహాల పుర్రెలు, కళేబరాలు దళితుల గృహాల ముందు కుక్కలు, పందులు పడేస్తుండటంతో దళితులు అధికారులను ఆశ్రయించి శ్మశానాన్ని మార్చాలని ఆందోళనలు చేపట్టారు. దీనికి బీసీ వర్గాలు అడ్డు చెప్పడంతో నాలుగు నెలల నుంచి బీసీ, ఎస్సీ వర్గాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్‌ ఎస్‌.రవి, మండల సర్వేయర్‌ అశోక్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయించిన శ్మశానం స్థలాన్ని పరిశీలించి కబ్జాకు గురైన రహదారి, శ్మశాన స్థలాన్ని ఖాళీ చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం, 5 మీటర్ల వెడల్పుతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పనులు చేపట్టేందుకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో ఇరువర్గాల మద్య సమస్య పరిష్కారం కానుంది.

Updated Date - Jun 04 , 2025 | 12:13 AM