నిజాయితీ చాటిన ఆ ముగ్గురు..
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:29 AM
రోడ్డుపై ఒక్క రూపాయి దొరికినా వదలని వాళ్లు ఉన్నారు. అలాంటి ఏకంగా లక్షల విలులైన ఆభరణాలు, నగదు ఉన్న సంచి రోడ్డు మీద దొరికినా నిజాయితీగా పోలీసులకు అప్పగించారు
నగదు, నగల బ్యాగ్ పోలీసులకు అప్పగింత
బాధితులకు అందజేసిన రూరల్ ఎస్‌ఐ
ఎమ్మిగనూరు రూరల్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): రోడ్డుపై ఒక్క రూపాయి దొరికినా వదలని వాళ్లు ఉన్నారు. అలాంటి ఏకంగా లక్షల విలులైన ఆభరణాలు, నగదు ఉన్న సంచి రోడ్డు మీద దొరికినా నిజాయితీగా పోలీసులకు అప్పగించారు ఆ ముగ్గురు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎమ్మిగనూరుకి చెందిన సోహెల్‌బేగ్, వలి, పెద్దకడుబూరుకి చెందిన కురువ నరసింహులు పనినిమిత్తం ఆదోనికి వెళ్తున్నారు. మండలంలోని బోడబండ గ్రామ సమీపాన మెయిన్‌రోడ్డుపై వారికి ఓ బ్యాగ్ దొరికింది. అది తెరిచిచూడగా అందులో రెండు బంగారు బిస్కెట్లు, నల్లపూసల బంగారు దండ, రెండు పొరల బంగారు దండ, బంగారు నెక్లెస్ దండ, చెవిచుట్లు, బ్రాస్లెట్, ఒక జత కమ్మలు, వెండి చైన్లుతో పాటు సుమారు రూ.2.50లక్షల నగదు, దుస్తులు ఉన్నాయి. ఎవరో బ్యాగ్‌ను పోగొట్టుకున్నారని గమనిం చిన వారు వెంటనే ఎమ్మిగనూరు రూరల్ ఎస్‌ఐ శ్రీనివా సులుకు బ్యాగ్‌ను అప్పజెప్పారు. అదే సమయంలో నందవరానికి చెందిన కురువ లలిత భర్త, చంద్రగుప్త ఆదోని నుంచి వచ్చి తమ బ్యాగ్ పోయిందని తెలిపారు. పోలీసులు విచారించి ఆ బ్యాగ్ లలిత, చంద్రగుప్తలదని నిర్ధారిం చుకున్నారు. బాధితులకు ఆ ముగ్గురి సమక్షంలోనే ఎస్‌ఐ శ్రీనివాసులు బ్యాగ్‌ను అప్పగించారు. తమ బ్యాగ్‌ను అప్పజెప్పిన ఎమ్మిగనూరు రూరల్ ఎస్‌ఐశ్రీనివాసులకు, బ్యాగ్‌ను నిజాయితీగా తెచ్చి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పిన సోహెల్‌బేగ్, వలి, కురువ నరసింహులుకు వారు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - Jun 11 , 2025 | 12:29 AM