ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా రెవెన్యూ దినోత్సవం

ABN, Publish Date - Jun 21 , 2025 | 12:29 AM

పట్టణంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగి టీఎండి హెసేన్‌ను ఆర్డీవో భరత్‌నాయక్‌, తహసీల్దార్‌ హుసేన్‌సాహెబ్‌ సిబ్బంది సన్మానించారు

దేవనకొండలో సిబ్బందిని సన్మానిస్తున్న అధికారులు

పత్తికొండ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగి టీఎండి హెసేన్‌ను ఆర్డీవో భరత్‌నాయక్‌, తహసీల్దార్‌ హుసేన్‌సాహెబ్‌ సిబ్బంది సన్మానించారు. డివిజన్‌ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన 58మందికి ప్రశంసా పత్రాలను అందించామన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి

తుగ్గలి: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని టీడీపీ మండల అధ్యక్ష ఉపాధ్యక్షుడు తిరుపాల్‌నాయుడు, వెంకట్రాముడు చౌదరి కోరారు. శుక్రవారం కార్యాలయంలో తహసీల్దార్‌ రవి, డీటీ సుదర్శన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌ రెడ్డిని రెవెన్యూ డే సందర్భగా సన్మానించారు. మండలం వెనుకబడ్డ ప్రాంతమని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి వస్తుంటారనీ, వారి సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరి చేయాలన్నారు. వల్లె వెంకటేశ్‌, భీమలింగప్ప చౌదరి, మైరాముడు, మల్లయ్య, కృష్ణ, నల్లగుండ్ల రవి ఉన్నారు.

ప్రజల కోసమే పనిచేయాలి

ఆదోని రూరల్‌: రెవెన్యూ ఉద్యోగులు ప్రజల కోసమే పనిచేయాలని తహశీల్దార్‌ రమేష్‌ సూచించారు. శుక్రవారం కార్యాలయంలో రెవెన్యూ డే నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ప్రజా సేవలో రెవెన్యూ కీలకం

దేవనకొండ: ప్రజాసేవలో రెవెన్యూ సేవలు కీలకమని తహసీల్దార్‌ రామాంజినేయులు అన్నారు. రెవెన్యూ డే సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. రీసర్వే తహసీల్దార్‌ అమీనాబేగం, సీనియర్‌ వీఆర్వో రాజన్న, వీఆర్‌ఎ అంజినేయ్యలకు సన్మానం చేశారు. డీటీ శశికళ, సీనియర్‌అసిస్టెంట్‌ రవి, ఆర్‌ఐ విజయ్‌భాస్కర్‌, వీఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:29 AM