ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రీసర్వే మంచి పరిష్కార వేదిక

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:46 PM

భూ సమస్యలు పరిష్కరించేందుకు రీసర్వే ఒక మంచి పరిష్కారవేదిక అని సర్వే, భూరికార్డుల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వెంకటేశ్వరరావు అన్నారు.

సమీక్షిస్తున్న రీజినల్‌ జాయింట్‌ డైరక్టర్‌ వెంకటేశ్వరరావు

ప్రామాణికతను పాటిస్తూ సర్వే చేయాలి

సర్వే, భూరికార్డుల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వెంకటేశ్వరరావు

జిల్లా సర్వేయర్లతో రీసర్వేపై సమీక్ష

నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలు పరిష్కరించేందుకు రీసర్వే ఒక మంచి పరిష్కారవేదిక అని సర్వే, భూరికార్డుల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వెంకటేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో జిల్లా సర్వేయర్లతో రీసర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్‌జేడీ మాట్లాడు తూ సర్వేయర్లు సర్వే సమయంలో భూయజమానుల సహకారంతో ప్రామాణికతలను పాటిస్తూ సర్వే చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2027 నాటికి భూముల రీసర్వే పూర్తిచేయాలని ఆదేశించిందన్నారు. అందుకు అనుగుణంగా గ్రామ సర్వేయర్లు ఆధునిక సర్వే సాంకేతిక పరికరాలతో కచ్చితత్వంతో కూడిన రికార్డులను తయారుచేయాలని కోరారు. నిర్దేశిం చిన సమయం లోపు రైతులను దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశిం చారు. అనంతరం సర్వేయర్‌లు అందజేసిన గ్రామాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. సమావేశంలో జిల్లా అధికారి జయ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 11:46 PM