పెండింగ్ అర్జీలను పరిష్కరించండి
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:50 PM
‘తల్లికి వందనం’కు సంబంధించి ఎంపీడీవోల పరిధిలో, జడ్పీ సీఈవో, తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉన్న అర్జీలను డీఆర్వో పర్యవేక్షించి, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం’కు సంబంధించి ఎంపీడీవోల పరిధిలో, జడ్పీ సీఈవో, తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉన్న అర్జీలను డీఆర్వో పర్యవేక్షించి, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేధిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారు లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబరు 2వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం అన్నారు. కలెక్టరేట్ కార్యాలయాల పరిసరాల్లో ఎటువంటి చెత్తాచెదారం పడవేయ కుండా సిబ్బందికి ఆదేశాలు జారీచేయాలని హెచ్‌వోడీలను ఆదేశించారు. ట్రాన్స్‌జెండర్లు స్వశక్తితో రాణించాలని కలెక్టర్ అన్నారు. విభిన్న ప్రతిభావం తుల శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులను అందజే శారు. బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాల ని కలెక్టర్ ఎంపీడీవోలను ఆదేశించారు. జేసీ డా.బి.నవ్య, డీఆర్వో వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటే శ్వర్లు, ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలు సందీప్‌కుమార్, భరత్‌నాయక్, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, సీపీవో హిమప్రభా కర్ రాజు పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 11:50 PM