భూసేకరణ కేసులను పరిష్కరించండి
ABN, Publish Date - May 13 , 2025 | 11:54 PM
భూసేకరణ కేసులను త్వరిత గతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారు లను ఆదేశించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, మే 13 (ఆంధ్రజ్యోతి): భూసేకరణ కేసులను త్వరిత గతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారు లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో భూసేకరణ కేసుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు, ఆదోని, పత్తికొండ డివిజన్లకు సంబంధించి మండలాల వారీగా భూసేకరణ కేసుల గురించి సమీక్షించారు. ఏమండలంలో భూసేకరణ సమస్యలు, వాటికి చెల్లించాల్సిన డబ్బు, తదితర సమస్యలపై ఆరాతీశారు. భూసేకరణకు సంబంధించి కోర్టు కేసులపై వెంటనే స్పందించాలని అధికారులను సూచిం చారు. జిల్లాస్థాయిలో పూర్తి నివేదికను తయారు చేయాలని డీఆర్వోను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆరీవోలు సందీ్‌పకుమార్, భరత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనురాధ, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 11:54 PM