గ్రీన్‌కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు అద్భుతం
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:15 AM
ప్రపంచ స్థాయి ప్రతి ష్టాత్మక గ్రీన్-కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఒక అద్భుతమని తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు
తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తాం
ప్రాజెక్టును సందర్శించేందుకే వచ్చా
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఓర్వకల్లు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ స్థాయి ప్రతి ష్టాత్మక గ్రీన్-కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఒక అద్భుతమని తెలంగాణ రాష్ట్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఓర్వకల్లు మండలంలోని గుమితం తండా సమీపాన ఉన్న సోలార్ పార్కు గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును టీఎస్ డిప్యూటీ సీఎంతో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సందర్శించారు. అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎంకు గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, గ్రీన్ కో అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అప్పర్ ఇన్‌టెక్ పాయింట్ సోలార్ పార్కు గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు విండ్ పవర్ ప్రాజెక్టులను రిజర్వాయరు నుంచి నీటిని పైపులైన్ ద్వారా టర్న్‌ల వరకు సరఫరా చేసే విధానాన్ని వారు పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో టీఎస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు ప్రపంచంలో మొట్టమొదటిదన్నారు. ఇలాంటి ప్రాజెక్టు మన దేశంలో ఉండటం గర్వకారణ మన్నారు. తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున దీన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా వచ్చానన్నారు. గ్రీన్ కో సంస్థ అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసి కరెంటు ఉత్పత్తి చేస్తుందన్నారు. సోలార్ ద్వారా 4వేల మెగా వాట్ల విద్యుత్, విండ్ హైడ్రా ద్వారా 2వేల గ్రీన్ ఎనర్జీ ఇక్కడి నుంచి ఉత్పత్తి చేస్తున్న దని అన్నారు. గ్రీన్‌కో ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ శ్రీనివా సులు, గ్రీన్ కోఅసిస్టెట్ డైరెక్టర్ శ్రీనివాసనాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్ పాల్గొన్నారు.ఛి
Updated Date - Jun 08 , 2025 | 12:15 AM