జీడీపీకి నీటి విడుదల చేయండి
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:15 AM
కర్నూలు నగరానికి నీటి సమస్య తలెత్తకుండా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్(హంద్రీనీవా సుజల స్రవంతి) నుంచి నీరు విడుదల అవుతున్న సమయంలోనే గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)కి నీటిని విడుదల చేయాలని కలెక్టర్ రంజిత్‌బాషా ఇరిగేషన్ శాఖ డీఈని ఆదేశించారు.
హంద్రీనీవా నీటితో 68చెరువులను నింపాలి
కలెక్టర్ రంజిత్ బాషా
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ విస్తరణ పనుల పరిశీలన
కల్లూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరానికి నీటి సమస్య తలెత్తకుండా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్(హంద్రీనీవా సుజల స్రవంతి) నుంచి నీరు విడుదల అవుతున్న సమయంలోనే గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)కి నీటిని విడుదల చేయాలని కలెక్టర్ రంజిత్‌బాషా ఇరిగేషన్ శాఖ డీఈని ఆదేశించారు. బుధవారం కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హంద్రీనీవా విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి ప్రవాహం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా హంద్రీనీవా నీటితో 68 చెరువులను కూడా నింపే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాలువ వెంబడి ఉన్నటువంటి కృష్ణగిరి రిజర్వాయర్, పత్తికొండ రిజిర్వాయర్‌లతో పాటు అన్ని తూముల ద్వారా ఆయకట్టుకు నీటిని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌చార్జ్ ఈఈ ప్రసాదరావు, డీఈ కొండన్న, చెన్నయ్య, కల్లూరు తహసీల్దారు కె.ఆంజనేయులు పాల్గొన్నారు.
గర్భిణులు, పిల్లలు, బాలింతల..
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రంజిత్ బాషా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. చిన్నటేకూ రులో అంగన్‌వాడీ సెంటర్‌ను తనిఖీ చేశారు. మోనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందిం చాలని సూచించారు. వండిన భోజనాన్ని పరిశీలించారు. ఐసీడీఎస్ పీడీ నిర్మల ఉన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 12:15 AM