ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బంధువులే భూమిని కాజేశారు

ABN, Publish Date - Jul 11 , 2025 | 12:13 AM

బంధువులే తమ భూమిని కాజేశారని ఐదుగురు అక్కాచెల్లెళ్లు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు వీడియో ద్వారా ఫిర్యాదు చేశారు. మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఇరిగేషన్‌ ఏఈ ఉసేని కుటుంబం ఎమ్మిగనూరు పట్టణం లోని మునెప్ప నగర్‌లో నివాసం ఉంటున్నది.

లోకేశ్‌కు పంపిన వీడీయోలో ఆవేదనను తెలుపుతున్న అక్కాచెల్లెళ్లు

రీ సర్వేలో అధికారుల మద్దతుతో దాయాదుల అక్రమాలు

మంత్రి లోకేశ్‌కు మొరపెట్టుకున్న అక్కాచెల్లెళ్లు..

ఎమ్మిగనూరు/మంత్రాలయం, జూలై 10(ఆంధ్రజ్యోతి): బంధువులే తమ భూమిని కాజేశారని ఐదుగురు అక్కాచెల్లెళ్లు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు వీడియో ద్వారా ఫిర్యాదు చేశారు. మంత్రాలయం మండలం రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఇరిగేషన్‌ ఏఈ ఉసేని కుటుంబం ఎమ్మిగనూరు పట్టణం లోని మునెప్ప నగర్‌లో నివాసం ఉంటున్నది. ఏఈ ఉసేనికి షహ నాజ్‌ బాను, షహబాన బాను, షకీలా బాను, షర్మిలా బాను, సానియా బాను అనే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఏఈ ఉసేని, అతని భార్య షేక్‌ నబీలకు సొంత గ్రామమైన మంత్రాలయం మండలం రచ్చు మర్రిలో 8.22 ఎకరాల (ఉసేనికి 519బీలో 3.66 ఎకరాలు, షేక్‌నబీకి 453ఏలో 4.66ఎకరాలు) భూమి ఉంది. ఈ భూ మిని కాజేయడానికి రీసర్వే సమయంలో ఉసేనికి ఎలాంటి సమా చారం ఇవ్వకుండా సొంత అన్న, అతని నలుగురు కుమారులు అధికారుల అండదండలతో రెండు సర్వేనంబర్ల లోని 3.66 ఎకరాల భూమి రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేయించు కున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఈ ఉసేని, అతని కుమార్తెలు అప్పటి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అయినా

సమస్య పరిష్కారం కాకపోవటంతో సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడ న్యాయం జరగక పోవటంతో కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. పైగా ఉసేని అన్న, అతని కుమారులు ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేయొద్దని బెదిరించారు. ఈ నేపథ్యంలో ఉసేని ఐదుగురు కుమార్తెలు వీడియో ద్వారా తమ గోడును మంత్రి నారా లోకేష్‌కు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పెద్దనాన్న, అతని కుమారులు తమ వారసత్వ భూమని కాజేశారని అన్నారు. మంత్రి నారా లోకేష్‌ ఈ సమస్యను పరిష్కరిస్తారన్న ఆశతో ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 12:13 AM