అవయవదానంతో ఒకరికి పునర్జన్మ
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:00 AM
అవయవదానంతో మరో వ్యక్తి పునర్జన్మ ఇవ్వవచ్చని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం నగరంలోని కిమ్స్ హాస్పిటల్‌లో 56 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవం తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్, కిమ్స్ ఆసుపత్రుల సీఎండీ డా.బొల్లినేని భాస్కర్‌రావు హాజరయ్యారు.
కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా
‘జీవన్‌దాన్’ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): అవయవదానంతో మరో వ్యక్తి పునర్జన్మ ఇవ్వవచ్చని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం నగరంలోని కిమ్స్ హాస్పిటల్‌లో 56 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవం తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్, కిమ్స్ ఆసుపత్రుల సీఎండీ డా.బొల్లినేని భాస్కర్‌రావు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ అవయవదానం మానవతా కోణంతో చేసే గొప్పపని అని అన్నారు. కిమ్స్ హాస్పిటల్‌లో ఇప్పటివరకు 56 కిడ్నీ మార్పిడులు చేయడం గొప్ప విషయమని అభినందించారు. జీవన్‌దాన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవయవదానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జీవన్‌ధాన్ ద్వారా లక్ష అవయవదానాలను రిజిస్టర్ చేసుకునే ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మొదట అవయవదాన రిజిస్టర్‌ను కిమ్స్ గ్రూప్ ఆసుపత్రుల సీఎండీ డా.బొల్లినేని భాస్కర్‌రావు చేయించుకొని మాట్లాడారు. కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌లో లివర్ మార్పిడిని త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.పి.శాంతికళ, కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు డా.ఉమామహేశ్వరరావు, నెఫ్రాలజీ, యురాలజిస్టులు డా.అనంతరావు, డా.మనోజ్, డా.రఫీక్ అహ్మద్, కిమ్స్ హాస్పిటల్ సీఈవో డా.సునీల్ సేపూరి పాల్గొన్నారు.
Updated Date - Apr 27 , 2025 | 12:00 AM