ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

8 స్కానింగ్‌ కేంద్రాలకు సిఫారసు

ABN, Publish Date - May 29 , 2025 | 11:21 PM

జిల్లాలో కొత్తగా 8 స్కానింగ్‌ కేంద్రాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ కోసం కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లు డీఎంహెచ్‌వో డా.పి. శాంతికళ తెలిపారు.

జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో శాంతికళ

వైద్య ఆరోగ్య శాఖలో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం

కర్నూలు హాస్పిటల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 8 స్కానింగ్‌ కేంద్రాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ కోసం కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లు డీఎంహెచ్‌వో డా.పి. శాంతికళ తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం డీఎంహెచ్‌వో అధ్యక్షతన జరిగింది. కొత్తగా 8, రెన్యువల్‌ కోసం 17 స్కానింగ్‌ కేంద్రాలకు అనుమతి కోసం సిఫారసు చేశామని డీఎంహెచ్‌వో వెల్లడించారు. ఆడపిల్లల ప్రా ముఖ్యత, సరియైున వివాహ వయస్సుపై అవగాహన కోసం ఎన్జీవోల సహకారం తీసుకోవాలన్నారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువ ఉన్న మండలాల్లో డిగ్రీ, ఇంటర్‌, నర్సింగ్‌ కాలేజీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీపీఎన్‌డీ యాక్టు జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డా. నాగప్రసాద్‌, కర్నూ లు జీజీహెచ్‌ చెందిన పీడియాట్రిక్‌, గైనిక్‌, రేడియాలజీ హెచ్‌వోడీలు డా.బి. విజయానందబాబు, డా. శ్రీలక్ష్మి, డా. రాధారాణి, సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఖాదర్‌బాషా, ఎన్జీవో సభ్యులు కొమ్ముపాలెం శ్రీనివాసులు, అ సిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ దివాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:21 PM