ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పైసలు.. పైరవీలు..!

ABN, Publish Date - May 30 , 2025 | 12:08 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు పోస్టింగ్‌ల కోసం పైరవీలు మొదలె ట్టారు. ఒక్కో పోస్టు రూ. లక్షల్లో పలుకుతున్నట్లు తెలు స్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు సైతం పైసలిస్తే.. పోస్టిం గ్‌కు సిఫారసు చేస్తామని అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నంద్యాల మార్కెట్‌ యార్డు

యార్డులో పోస్టులకు డిమాండ్‌

సెక్రెటరీ పోస్టుకు రూ.లక్షల్లో ముడుపులు?

నంద్యాల, మే 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు పోస్టింగ్‌ల కోసం పైరవీలు మొదలె ట్టారు. ఒక్కో పోస్టు రూ. లక్షల్లో పలుకుతున్నట్లు తెలు స్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు సైతం పైసలిస్తే.. పోస్టిం గ్‌కు సిఫారసు చేస్తామని అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు రోజులు విజయవాడలో జరిగిన కౌన్సిలింగ్‌కు నాయ కుల సిఫార్సులతో అధికారులు హాజరైనట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు వారికి ఉత్తర్వులు అందలేదు. ఉమ్మడి జిల్లాలోని ఆదోని, నంద్యాల, కర్నూలు మార్కెట్‌యార్డుల సెక్రటరీ పోస్టులు ఎవరికి దక్కుతాయనే విషయంలో ఆ శాఖ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు- 07, నంద్యాల -08 చొప్పున మొత్తం ఉమ్మడి జిల్లాలో 15 మార్కె ట్‌ యార్డులు ఉన్నాయి. ఆయితే ఇందులో ఆదోని, కర్నూలు, నంద్యాల మార్కెట్‌ యార్డులకు మాత్రం డిమాండ్‌ ఉంది. ఆయితే ఆదోని సెక్రటరీ ఇటీవల రిటైర్‌ కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టు రాష్ట్రంలోనే ప్రధానమైన వాటిలో ఒకటి. ఇలాంటి పోస్టుకు ముగ్గురు అధికారులు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కీలమైనది కర్నూలు మార్కెట్‌యార్డు సెక్రటరీ పోస్టు. ఇక్కడ అనంతపురం మార్కెట్‌ యార్డు అధికారి ప్రస్తుతం ఇన్‌చార్జి సెక్రటరీగా (ఓడీలో) పనిచేస్తున్నారు. ఇక్కడి రెగ్యులర్‌ అధికారి అనంత పురం యార్డులో ఇన్‌చార్జిగా (ఓడీ) రూపంలో పనిచేస్తు న్నారు. ఈ క్రమంలో కర్నూలు ఇన్‌చార్జి హోదాలో పనిచేస్తు న్న సదరు సెక్రటరీనే రెగ్యులర్‌గా తెచ్చుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆయితే ఇప్పటికే రెగ్యులర్‌ స్థానం కలిగిన అధికారి(అనంతపురంలో పనిచేసే) సైతం ఈ బదిలీల్లో యథాస్థానానికి రావాలని యోచిస్తు న్నట్లు తెలిసింది. సాధ్యపడకపోతే.. నంద్యాలకు లేదా.. ఆదోనికి పోస్టింగ్‌కు ఇవ్వాలని ఇటీవల జరిగిన కౌన్సిలింగ్‌లో సదరు అధికారి మొర పెట్టుకున్నట్లు సమాచారం.

కౌన్సెలింగ్‌ జరిగినా..

వాస్తవంగా ఈనెల ఆఖరికి బదిలీ ప్రక్రియ కొలిక్కి రానుంది. ఆయితే.. మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఈనెల 22వరకు ఆప్షన్‌ ఇచ్చారు. ఆ తర్వాత 26, 27వ తేదిలో విజయవాడలో డైరెక్టర్‌ విజయసునీత కౌన్సెలింగ్‌ పూర్తి చేశారు. ఆయితే.. ఈ ఉమ్మడి జిల్లాలోని ఈ మూడు సెక్రటరీ పోస్టుల ఎంపికపై ఆ శాఖ మంత్రి సంతకం కూడా ఉండాలి. సదరు మంత్రి మహానా డులో ఉండటంతో ఉత్తర్వులు జాబితా జాప్యమవుతోంది. ఎవర్ని ఎక్కడికి బదిలీ చేశారో..? ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చారో...? ఎవరి ప్రయత్నం ఫలించిందో...? ఇప్పటికీ తెలియకపోవడంతో పరిస్థితి ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ పోస్టుల ఎంపికపై మరో రెండు రోజుల్లో స్పష్టత రావచ్చు.

ఆ రెండు పోస్టులకు రూ.లక్షల్లో..?

అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆదోని మార్కెట్‌యార్డు సెక్రటరీ పోస్టుపై ముగ్గురు అధికారులు కన్నేశారని తెలిసింది. ఈ పోస్టు పొందాలంటే సుమారు రూ. 7 లక్షల నుంచి రూ. 10లక్షలు వెచ్చించాల్సి వస్తోందని తెలిసింది. ఆయినప్పటికీ ముగ్గురు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. ఉమ్మడి జిల్లాలోని ఓ సెక్రటరీ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇద్దరు సెక్రటరీలు తీవ్ర స్థాయిలో పోటీ చేసినట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు పడమర దిశలో పనిచేస్తున్న సెక్రటరీ కూడా అడిగినట్లు సమాచారం. ఇదే తరహాలో కర్నూలు మార్కెట్‌యార్డు సెక్రటరీ పోస్టు కూడా రూ. 5 నుంచి రూ.7లక్షలు వెచ్చించాల్సి వస్తోందని ఆ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడే ఇన్‌చార్జిగా పనిచేస్తున్న అధికారి రెగ్యులర్‌ కావడం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాకపోతే.. ఇక్కడి రెగ్యులర్‌గా ఉండి.. గతంలో భంగపాటుకు గురైన అనంతపురంలో ఇన్‌చార్జి సెక్రటరీగా పనిచేస్తున్న అధికారి తనను రెగ్యులర్‌ స్ధానమైన కర్నూలులోనే ఉంచాలని కోరినట్లు సమాచారం. లేకపోతే.. నంద్యాల, ఆదోని పోస్టుల్లో ఎక్కడైనా కేటాయించాలని కౌన్సిలింగ్‌లో కోరినట్లు తెలిసింది. ఇదే తరహాలో ఉమ్మడి జిల్లాలో పనిచేసే మరో సెక్రటరీ కూడా కర్నూలుకు ట్రై చేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో నంద్యాలకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేసే మరో సెక్రటరీ(ఇద్దరిలో ఒకరు) అటు ఫలించకపోతే..కనీసం నంద్యాలకు అవకాశం కల్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అనుకున్న విధంగా జరగకపోతే.. ఆదోని తప్ప.. మిగిలిన ఇద్దరు సెక్రటరీలు యధాస్థానంలో ఉండాలని కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాము కోరుకున్న చోటికైతే వెళ్తాం.. లేకుంటే ఇక్కడే ఉండిపోతాం అన్నట్టుంది ఇద్దరు సెక్రటరీల పరిస్థితి.

Updated Date - May 30 , 2025 | 12:08 AM