అదుపులో బియ్యం దొంగలు
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:13 AM
మండలంలోని కరిడిగుడ్డం సమీపంలో సోమవారం అర్ధరాత్రి 34 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆలూరు ఎస్‌ఐ మహబూబ్ బాషా తెలిపారు.
ఆలూరులో 34 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
వాహనం స్వాధీనం, ఇరువురిపై కేసు నమోదు
ఆలూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కరిడిగుడ్డం సమీపంలో సోమవారం అర్ధరాత్రి 34 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆలూరు ఎస్‌ఐ మహబూబ్ బాషా తెలిపారు. వివరాల మేరకు.. ఏపీ39 డబ్ల్యూబీ 3291 నంబర్ గల బొలెరో వాహనంలో రేషన్ బియ్యాన్ని ఆదోని వైపు తరలి స్తుండగా స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.ఈ కార్యక్రమంలో వీఆర్వోలు రామకృష్ణ, లింగన్న ఆధ్వర్యంలో వాహనాన్ని సీజ్‌చేసి బియ్యాన్ని ఆలూరు సివిల్ సప్లై గోదాంకు ఏఎస్‌ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తరలించారు. ఆదోనికి చెందిన ఇందప్ప, షేక్షావలిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ రవిశంకర్‌రెడ్డి మంగళవారం రాత్రి విలేకరులకు తెలిపారు.
Updated Date - Jun 18 , 2025 | 12:13 AM