ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీజీహెచ్‌లో అరుదైన ఆపరేషన్లు

ABN, Publish Date - May 27 , 2025 | 12:30 AM

పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న అనంతపురం, నంద్యాల జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళా రోగులకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సర్జరీ వైద్యులు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు.

రోగులతో పెద్దాసుపత్రి సూపరింటెండెంట్‌ డా.వెంకటేశ్వర్లు, వైద్యులు

పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌ రోగులకు శస్త్రచికిత్సలు విజయవంతం

కర్నూలు హాస్పిటల్‌, మే 26(ఆంధ్రజ్యోతి): పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న అనంతపురం, నంద్యాల జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళా రోగులకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సర్జరీ వైద్యులు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన సీనియర్‌ సర్జరీ ప్రొఫెసర్‌ డా.పి.రామకృష్ణ నాయక్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సబీరా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.మన్సూర్‌బాషా, డా.ప్రణీత్‌, అనస్థీషియా ప్రొఫెసర్‌ డా.సుధీర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.మురళి ప్రభాకర్‌ వైద్య బృందాన్ని కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు సర్జరీ హెచ్‌వోడీ డా.హరిచరణ్‌ అభినందించారు.

సర్జరీ ప్రొఫెసర్‌ డా.రామకృష్ణ నాయక్‌ అరుదైన శస్త్ర చికిత్స వివరాలను విలేకరులకు వివరించారు. అనంతపురం జిల్లా బాల వెంకటాపురానికి చెందిన 29ఏళ్ల పర్వీన్‌ గర్భాశయ రక్తస్రావంతో బాధపడుతూ ఏప్రిల్‌ 27వ తేదీ ఆసుపత్రిలో చేరిందని తెలిపారు. పోర్టల్‌ హైపర్‌టెన్షన్‌తో బాధపడు తున్న ఆమెకు ఎండోస్కోపిలో అన్నవాహికలో వేరినెస్‌ గుర్తించి బ్యాండ్‌లిగేషన్‌ అనంతరం పెద్దపరిమాణంలో కొల్లాటెరల్స్‌, పోర్టల్‌ క్యావెర్నోమా గుర్తించినట్లు తెలిపారు. స్ల్పీవెక్టమీ ఈ నెల 3వ తేది నిర్వహించగా, స్ల్పక్‌ బరువు 1.5 కిలోలుగా నమోదైందని చెప్పారు. ప్రాథమికంగా 50వేలు ఉన్న రక్తకణాలు అనంతరం 4లక్షలకు పెరగిం దని, ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉందని తెలిపారు.

అలాగే నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన 15 ఏళ్ల ఎలిషారాణి వాంతుల్లో రక్తస్రావం వంటి లక్షణాలతో ఈ నెల 5వ తేదీన అడ్మిషన్‌ పొందగా, 8వ తేదీన ఆపరేషన్‌ నిర్వహించినట్లు డా.రామకృష్ణ నాయక్‌ తెలిపారు. రోగి వచ్చిన సమయానికి హిమోగ్లోబిన్‌ 6 గ్రాములు, ప్లేట్‌లెట్‌ కణాలు 60వేలుగా ఉండటంతో ఎండోస్కోపి బ్యాండ్‌లిగేషన్‌ చేశామని చెప్పారు.

అనంతరం ఆపరేషన్‌ పరిశీలనలో స్ల్పీనోరినల్‌ స్టంట్‌ ఆపరేషన్‌ను ఈ నెల 6వ తేదీ నిర్వహించగా, రోగి రక్తకణాలు 5 లక్షలకు పెరిగాయని తెలిపారు. ఆపరేషన్‌ అనంతరం లక్షణాలు బాగా తగ్గిపోయి రోగి ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. కార్యక్రమంలో అనస్థీషియా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.మురళి ప్రభాకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.రఘు ప్రవీణ్‌, డా.సంధ్యా, జనరల్‌ సర్జరీ, పీజీ వైద్య విద్యార్థులు డా.సర్పరాజ్‌, డా.సాయిచరణ్‌, డా.శిరీష పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:30 AM