ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీమాపై అవగాహన కల్పించండి

ABN, Publish Date - Jul 11 , 2025 | 11:51 PM

రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాజకుమారి మండల వ్యవసాయాధికారులను ఆదేశించారు.

బీమా బ్రోచర్లను విడుదల చేస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

వ్యవసాయాధికారులతో సమావేశం

నంద్యాల టౌన్‌/ నంద్యాల ఎడ్యుకేషన్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రైతులకు పంటల బీమాపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాజకుమారి మండల వ్యవసాయాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో పంటల బీమాపై జిల్లా వ్యవసాయాధికారులు, బ్యాంక్‌ అధికారులతో కలెక్టర్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు వేసే ప్రతి పంటకు తప్పనిసరిగా బీమా చెల్లించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. పంటల బీమా చేయించడంతో తుఫాన్లు, కరువు తదితర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. వాతావరణ అంశాల ఆధారంగా సంభవించిన పంట నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం చెల్లిస్తార న్నారు. రైతులు నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలని కోరారు. పంటలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా సమీపంలోని ఆర్‌ఎస్‌కేల వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయా ధికారి వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ అధికారి నాగరాజు, ఎల్‌డీఎం రవీంద్రకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:51 PM