జిల్లాలో వాన బీభత్సం
ABN, Publish Date - May 18 , 2025 | 11:40 PM
జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు విరగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
కర్నూలు అగ్రికల్చర్, మే 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లు విరగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆదివారం సగటున 9.7 ఎంఎం వర్షపాతం నమోదైంది. హాలహర్విలో అత్యధిక వర్షపాతం 83.4 ఎంఎం వర్షపాతం నమోదైంది. కర్నూలు రూరల్‌లో 69.2 ఎంఎం, హోళగుందలో 64.1, కర్నూలు అర్బన్‌లో 62.1, కల్లూరులో 53.4, మద్దికెరలో 45.2, ఆలూరులో 41.8, ఎమ్మిగనూరులో 25.4, ఆస్పరిలో 26.1, తుగ్గలిలో 25ఎంఎం, కౌతాళంలో 22 ఎంఎం, సీబెళగల్‌లో 15.4, దేవనకొండలో 15.4, కోడుమూరులో 19.2, పెద్దకడుబూరులో 17.6, ఆదోనిలో 15.7, చిప్పగిరిలో 15 ఎంఎం వర్షం కురిసింది. మే నెలలో 23.1 ఎంఎం వర్షం నమోదు కావాల్సి ఉండగా... ఆదివారం ఒక్కరోజే 9.7 ఎంఎం వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు.
Updated Date - May 18 , 2025 | 11:40 PM