ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కర్నూలులో రైల్వే డీజీఎం ఆకస్మిక పర్యటన

ABN, Publish Date - Apr 24 , 2025 | 11:46 PM

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌(డీజీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ గురువారం కర్నూలులో ఆకస్మికంగా పర్యటించారు.

కర్నూలు రైల్వేస్టేషన్‌లో పర్యటిస్తున్న జనరల్‌ మేనేజర్‌

రైల్వే వర్క్‌షాప్‌ పనుల పరిశీలన

కర్నూలు రూరల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌(డీజీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ గురువారం కర్నూలులో ఆకస్మికంగా పర్యటించారు. ఉదయం సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరి ఆయన మధ్యాహ్నం 12:30 గంటలకు కర్నూలు సిటీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రత్యేక వాహనంలో బయలుదేరి జోగుళాంబ-పంచలింగాల మధ్య నిర్మిస్తున్న కోచ్‌మిడ్‌లై్‌ఫ రిహాబిలిటేషన్‌ రైల్వే వర్క్‌షాపునకు చేరుకుని నూతన లైన్‌ అనుసంధానానికి సంబంధించిన నిర్మాణ పనులను పరిశీలించారు. కొత్త లైన్‌, వర్క్‌షాప్‌ నిర్మాణ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో సమీక్షించారు. వర్క్‌షాప్‌ నిర్మాణ పనులకు 2013-14 సంవత్సరంలో ప్రాథమికంగా రూ.283 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయబడిన తర్వాత దానిని రూ.562 కోట్లకు పెంచినట్లు రైల్వే అధికారులు జీఎంకు వివరించారు. ఈ వర్క్‌షాప్‌ పూర్తి అయితే నెలకు దాదాపు 50 కోచ్‌లను మరమ్మత్తు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌కు వివరించారు. మొదట దశలో నాన్‌-ఏసీ కోచ్‌ల మరమ్మతు పనులను చేపట్టే పని పూర్తవుతుందన్నారు. తర్వాత ఏసీ కోచ్‌ల నిర్వహణ పనులు చేపట్టడానికి వర్క్‌షా్‌పను పెంచుతారని జీఎంకు సంబందించిన అధికారులు కులంకుశంగా వివరించారు.

అభివృద్ధి పనుల పరిశీలన

వర్క్‌షాప్‌ పరిశీలన అనంతరం కర్నూలు సిటి రైల్వేస్టేషన్‌కు చేరుకుని స్టేషన్‌లో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను డీజీఎం పరిశీలించారు. ప్రధానంగా ప్రయాణికుల సౌకర్యాలు, వసతులు, సర్క్యులేటింగ్‌ ప్రాంతాన్ని తనీఖీ చేశారు. కర్నూలు సిటీ రైల్వేస్టేషన్‌లో రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు. అందుబాటులో ఉన్న ఓపెన్‌ జిమ్‌ ఆటస్థలం వంటి వాటిపై సమీక్షించారు. రైల్వేఉద్యోగ కుటుంబ సభ్యుల కోసం రైల్వే శాఖ అందించిన ఆధునిక క్రీడా పరికరాలను ఉపయోగించుకోవాలని అరుణ్‌కుమార్‌జైన్‌ సూచించారు. అనంతరం మద్యాహ్నం 2గంటలకు తిరిగి ప్రత్యేక రైల్లో సికింద్రాబాద్‌కు వెళ్లారు. ఆయనవెంట రైల్వే డీఆర్‌ఎం లోకేష్‌ విష్ణోయ్‌, డివిజనల్‌ రైల్వే సీనియర్‌ అధికారులు, కర్నూలు సిటీ రైల్వేమేనేజర్‌ శేషఫణి తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:46 PM