రాయచూరు టు తిరుపతి
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:06 AM
పర్యావరణ పరి రక్షణ కోసం రాయచూరుకు చెందిన రాజు, తిమ్మారెడ్డి, సునాల్ రా యచూరు నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేపట్టారు.
ఆదోని రూరల్, జూలై 12 ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరి రక్షణ కోసం రాయచూరుకు చెందిన రాజు, తిమ్మారెడ్డి, సునాల్ రా యచూరు నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఆస్పరి బైపాస్‌లో మారెమ్మవ్వ దేవాలయం వద్ద సైకిల్ యాత్రికులు సేదతీరారు. ఉదయం 5గంటలకు రాయచూరులో బయల్దేరామని, 14వ తేదీన సాయంత్రానికి తిరుపతికి చేరుకుం టామని వారు తెలిపారు. ప్రతి ఏటా వర్షాకాలం ఆ రంభంలో రాయ చూరు నుంచి తిరుపతికి సైకిల్‌పై వెళ్తామన్నారు. రోడ్డుకిరువైపులా చాలా ప్రాంతాల్లో పలురకాల మొక్కలను నాటుతామన్నారు. 12 సంవత్సరాలుగా తిరుపతికి సైకిల్‌లో వెళ్తున్నామన్నారు. 12ఏళ్ల క్రితం నాటిన చెట్లు ఇప్పుడు పెద్దవిగా అయ్యాయయని, వాటిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.
మొదటి సారి..
మొదటి సారి సైకిల్‌పై అందరితో పాటు తిరుపతికి వెళ్తున్నా. ఎంతో ఆనందంగా ఉంది. సమయం కూడా కనిపించడం లేదు. రాయచూరులో కూడా కాలుష్య నివారణ కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టాను.
సునీల్, రాయచూరు
Updated Date - Jul 13 , 2025 | 12:06 AM