ముమ్మరంగా పుష్కరిణి నిర్మాణ పనులు
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:13 AM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాలకు పుష్కరిణి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తెలిపారు.
పరిశీలించిన పీఠాధిపతి
మంత్రాలయం, జూలై 23(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాలకు పుష్కరిణి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తెలిపారు. బుధవారం శ్రీమఠం ఆధ్వర్యంలో భక్తులు ఇచ్చిన విరాళంతో నిర్మిస్తున్న పుష్కరిణి పనులను పరిశీలించారు. ఇప్పటికే అడుగు భాగం లో కాంక్రీట్ బెడ్డు, చుట్టూ కాంక్రీట్ గోడ పనులు, మెట్లు, చుట్టూ గోపు రం, మధ్యలో శిలామండపం ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. పను లు దాదాపు పూర్తికావస్తున్నాయి.తుంగభద్ర నదినుంచి నీటిని పంప్‌చేసి పుష్కరిణిలో తెప్పోత్సవ సేవకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Updated Date - Jul 24 , 2025 | 12:13 AM