ఇసుక రీచ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
ABN, Publish Date - May 29 , 2025 | 12:50 AM
మండలంలోని ముద్దటామాగి గ్రామంలో ఇసుకు రీచ్ ఏర్పాటుకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు.
హొళగుంద, మే 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముద్దటామాగి గ్రామంలో ఇసుకు రీచ్ ఏర్పాటుకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు. వేదవతి నదిలో సర్వే నెం. 127లో 7,814 హెక్టార్ల విస్తీర్ణంలో 78,140 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామస్థులు మాట్లాడుతూ తమ గ్రామం మీదుగా ఇసుక వాహనాలు వెళ్లేందుకు వీలులేదని, మార్లమాడికి మీదుగా వెళితే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గ్రామానికి వచ్చిన సబ్ కలెక్టర్‌కు నెల రోజులుగా తాగునీరు లేదని, పారిశుఽధ్య పనులు చేపట్టలేదని, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని ఫిర్యాదు చేశారు. అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు.
ఆంధ్రజ్యోతి విలేకరిపై కార్యదర్శి దౌర్జన్యం
వీడియో తీస్తున్న ఆంధ్రజ్యోతి విలేఖరిపై మార్లమా డికి పంచాయతీ కార్యదర్శి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దుర్భషలాడుతూ వెళ్లిపొమ్మని, ఎస్సీ కేసు పెడతా అంటూ బెదిరించారు. గ్రామస్థులు కార్యదర్శిని అడ్డుకుని తామే పిలిపించామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నిజాముద్దీన్, గనుల శాఖ డీడీ రవిచంద్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిషోర్ రెడ్డి ఉన్నారు.
Updated Date - May 30 , 2025 | 03:09 PM