మెరుగైన విద్యను అందించండి
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:13 PM
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచండి
కలెక్టర్ రాజకుమారి
ఆళ్లగడ్డ, జూలై 26(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం పట్టణంలోని పడకండ్ల గ్రామ సమీపంలో ఉన్న మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఆదర్శ పాఠశాలంటే ప్రతి అంశంలో ఏ గ్రేడ్‌లో ఉండాలన్నారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ఇక నుంచి పాఠశాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, పరిసరాలు శుభ్రంగా లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ఆమె వెంట కమిషనర్ కిషోర్, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ప్రిన్సిపాల్ గుర్రప్ప తదితరులు ఉన్నారు.
Updated Date - Jul 26 , 2025 | 11:13 PM