ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రారంభానికి అడ్డంకులు

ABN, Publish Date - May 10 , 2025 | 11:46 PM

పట్టణం లోని ప్రభత్వు పాలిటెక్నిక్‌ కళాశాలకు సొంత భవనం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 12న ప్రారంభించాలని ఉన్నతాధికారులు కళాశాల సిబ్బందిని ఆదేశించారు. అయితే కొందరు దాతలు కళాశాలకు తమ పేర్లు పెట్టాలన్న ఒప్పందంతో స్థలాన్ని విరాళంగా ఇచ్చారు

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పాలిటెక్నిక్‌ భవనం ఇదే

దాతలు ఇచ్చిన స్థలంలో పాలిటెక్నిక్‌ భవనం నిర్మాణం

తమ పేరు పెట్టాల్సిందేనంటున్న దాతలు.. జీవో రాలేదందంటున్న ప్రిన్సిపాల్‌

ఆలూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): పట్టణం లోని ప్రభత్వు పాలిటెక్నిక్‌ కళాశాలకు సొంత భవనం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 12న ప్రారంభించాలని ఉన్నతాధికారులు కళాశాల సిబ్బందిని ఆదేశించారు. అయితే కొందరు దాతలు కళాశాలకు తమ పేర్లు పెట్టాలన్న ఒప్పందంతో స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే భవనం కూడా నిర్మించారు. అగ్రహారం, యాటకల్‌ గ్రామాలకు చెందిన దాతలు నాగిరెడ్డి, సంజీవరెడ్డి 2018లో సర్వే నెం. 877లో 5 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం రూ.8 కోట్లతో నూతన భవనంను నిర్మించింది. తీరా తమ పేర్లు పెట్టకుండానే ప్రారంభిస్తున్నారని దాతలు అధికారులపై మండి పడుతున్నారు. దీంతో భవనాన్ని ఎలా ప్రారంభిచాలో తెలియక కళాశాల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం

కళాశాల భవనానికి స్థల దాతల పేర్లు పెట్టేందుకు జీవో ఇవ్వాలని పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ నెల 12న నూతన భవనంలోకి చేరాలని ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చాయి. అయితే స్థల దాతలు తమ పేర్లు పెట్టకుండానే ప్రారంభించడంపై అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో భవనం ప్రారంభించడం ఇబ్బందిగా మారింది. ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలి. - డా.చిన్నపుపరెడ్డి, ప్రిన్సిపాల్‌

Updated Date - May 10 , 2025 | 11:46 PM