ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీఎస్సీ అభ్యర్థులకు ఇక్కట్లు..

ABN, Publish Date - Apr 29 , 2025 | 11:59 PM

డీఎస్సీ-2025 రిక్రూట్‌మెంటకు ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు స్టడీ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేసవి సెలవులతో మూతబడిన ఆలూరు మెయిన్‌ స్కూల్‌

స్టడీ సర్టిఫికెట్ల కోసం పాట్లు

పాఠశాలల చుట్టూ ప్రదక్షిణలు

స్కూళ్లకు వేసవి సెలవులు

అందుబాటులో లేని హెచ్‌ఎంలు

ఆలూరు, ఏప్రిల్‌29(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2025 రిక్రూట్‌మెంటకు ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు స్టడీ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి మిగతా ధ్రువీకరణ పత్రాలతోపాటు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లను కూడా అప్‌లోడ్‌ చేయాలి. అయితే ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో గతంలో తాము చదివిన పాఠశాలల నుంచి స్టడీ సర్టిఫికెట్లు తీసుకోడానికి పాఠశాలల్లో హెచ్‌ఎం, టీచర్లు అందుబాటులో లేరు. వారి కోసం తిరగడంతో డీఎస్సీ పరీక్షకు చదువుకోవాల్సిన విలువైన సమయాన్ని కోల్పోతున్నామని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల 15న ముగియనుంది. అప్పటి దాకా వేసవి సెలవులు ఉన్నందు వల్ల స్టడీ సర్టిఫికెట్ల కోసం స్కూల్‌ హెచ్‌ఎంలను, ఉపాధ్యాయులను ఫోన్‌లలో సంప్రదిస్తూ ఉండటం తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది.

ఉన్నతాధికారులే పరిష్కారం చూపాలి

సుమారు 35 సంవత్సరాల క్రితం ప్రాథమిక పాఠశాలల్లో చదివిన 4వ తరగతి మొదలుకుని ఉన్నత పాఠశలల్లో 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు అభ్యర్థుల స్థానికతను నిర్ధారిస్తాయి. ఈ ధ్రువపత్రాల ప్రకారమే అభ్యర్థుల లోకల్‌, నాన్‌ లోకల్‌ స్టేటస్‌ను ఉద్యోగాల ఎంపికలో నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం నుంచి తాము చదువుకున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి ఆయా తరగతులకు స్టడీ సర్టిఫికెట్లను పొందడం అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. మెగా డీఎస్సీకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,645 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వేలాది మంది అభ్యర్థులు పోటీ పడతారన్న అంచ నాలున్న నేపథ్యంలో దరఖాస్తుకు అవసరమైన స్టడీ సర్టిఫికెట్ల కోసం ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం పరిష్కారం చూపాల్సి ఉంది.

అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం

ఇది కీలకమైన సమస్యే. డీఎస్సీ అభ్యర్థులకు స్టడీ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ఎదురవుతున్న సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. స్టడీ సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల హెచ్‌ఎంలకు సూచనలు ఇస్తాం. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు 8121821266, 9182152840 సంప్రదించాలి. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- శామ్యూల్‌ పాల్‌, డీఈవో, కర్నూలు

Updated Date - Apr 29 , 2025 | 11:59 PM