గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
ABN, Publish Date - Jul 23 , 2025 | 11:28 PM
గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జూలై 23(ఆంధ్రజ్యోతి): గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు మండలం కొంగనపాడులో ఎమ్మెల్యే బీటీ రోడ్డు, సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అధ్వానంగా మారాయని, కూటమి ప్రభుత్వం రహదారుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా బెంగళూరు జాతీయ రహదారి నుంచి 4 కిలో మీటర్ల మేర రూ.3.31 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. అలాగే కొంగనపాడు గ్రామంలో రూ.45లక్షలతో పూర్తి చేసిన 5 సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ నాగిరెడ్డి, ఏఈలు హనుమంతరెడ్డి, రవిమోహన్‌రెడ్డి, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి.రామాంజనేయులు, ఏపీ టూరిజం డైరెక్టర్ ముంతాజ్‌బేగం, టీడీపీ నాయకులు టి.వినోద్‌కుమర్, నాగయ్య, గోరంట్ల, లక్ష్మయ్య, మురళి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 11:28 PM