ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలి
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:22 AM
కల్లూరు మండలం గట్టయ్యనగర్ ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే.నాగేశ్వరరావు, సుధాకరప్ప డిమాండ్ చేశారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూన 27(ఆంధ్రజ్యోతి): కల్లూరు మండలం గట్టయ్యనగర్ ప్రాథమిక పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జే.నాగేశ్వరరావు, సుధాకరప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం డీఈవో కార్యాలయంలో డీఈవో శామ్యూల్‌పాల్‌ను సీఐటీయూ నాయకులు, తల్లిదండ్రుల కమిటీసభ్యుల కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గట్టయ్య నగర్‌లోని ప్రాథమిక పాఠశా లలో 50 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, 3, 4, 5 తరగతులు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న కస్తూర్భా పాఠశాలకు తరలించడం అన్యాయ మన్నారు. డీఈవో స్పం దిస్తూ ప్రభుత్వ పాలసీ విధానంలో కొన్ని పాఠశా లల విలీనాన్ని రద్దు చేశామని, కొన్ని పాఠశాలలను మరొక్క పాఠశాలకు తరలించామని చెప్పారు. సీఐటీయూ నాయకుడు యేసు, విద్యార్థుల తల్లిదం డ్రులు వెంకటలక్ష్మి, గౌరి, భారతి, సుశీల, రాధమ్మ పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:22 AM