నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలు
ABN, Publish Date - May 15 , 2025 | 12:28 AM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
నవరత్నాల రథంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు
మంత్రాలయం, మే 14(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు నవరత్నాల రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. వైశాఖ బుధవారం విధియ పర్వ దినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆఽధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య నవరత్నాల రథంపై ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు. వివిధ రాష్ర్టాలనుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది.
Updated Date - May 15 , 2025 | 12:28 AM