ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెక్క రథంపై ప్రహ్లాదరాయలు

ABN, Publish Date - Jul 17 , 2025 | 12:18 AM

: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

చెక్క రథంపై విహరిస్తున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, జూలై 16(ఆంధ్రజ్యోతి) : మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. బుధవారం ఆషాఢ మాస షష్ఠి కర్కాటక సంక్రమణ లో భాగంగా ఉదయం జరగాల్సిన ప్రత్యేక పూజలు మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాఘవరాయడికి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మూలరాములకు కనకాభిషేకం చేసి హస్తోదకం చేశారు. ప్రహ్లాదరాయల పాదపూజ అనంతరం పల్లకిలో ఊరేగించారు. చెక్క రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి ఊరేగించారు. అనంతరం ఊంజల సేవ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో మంత్రాలయం మార్మోగింది.

Updated Date - Jul 17 , 2025 | 12:18 AM