పీఎంశ్రీ నిధుల దుర్వినియోగం..?
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:37 AM
స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ పాఠశాలకు ఫేజ్-1 కింద రూ. 68 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా మంజూరయ్యాయి.
హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో అక్రమాలపై ఆరోపణలు
జిల్లా అధికారులు విచారణ చేయాలని డిమాండ్
హొళగుంద, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ పాఠశాలకు ఫేజ్-1 కింద రూ. 68 లక్షల నిధులు పీఎంశ్రీ పథకం ద్వారా మంజూరయ్యాయి. డిజిటల్ లైబ్రరీ గది నిర్మాణానికి రూ. 23లక్షలు, ప్లే ఫీల్డ్‌కు రూ. 5లక్షలు, కిచెన్ గార్డెన్‌కు రూ.1.25, బాయ్ప్ టాయిలెట్స్ రూ 6.50, గర్ల్స్ టాయిలెట్స్ రూ.5.25, ర్యాంప్స్, రైన్స్ నిర్మాణానికి రూ.50వేలు, నాలుగు ఇంకుడు గుంతలకు రూ.85వేల రూపాయలతో పాఠశాలలో నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలను నాసిరకంగా నిర్మించారని, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుకల ధరలు మార్కెట్ కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై బదిలీపై వెళ్లిన జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నజీర్ అహమ్మద్‌ను వివరణ కోరగా లైబ్రరీ గది నుండి ప్లే ఫీల్డ్ నిర్మాణం వరకు నాణ్యమైన సామగ్రిని వినియోగించామని, ఇప్పటికే ఈ నిధులపై అడిట్ అయిపోయిందని తెలిపారు.
Updated Date - Jun 26 , 2025 | 12:37 AM