పీఎం కిసాన్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలి
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:31 AM
: పీఎం కిసాన్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా తహసీల్దార్‌లను ఆదేశించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, మే 31 (ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్ వెరిఫికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా తహసీల్దార్‌లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులతో యోగాంధ్ర, హౌసింగ్, రెవెన్యూ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీసీఆర్‌సీ కార్డులకు 25వేల లక్ష్యాలను కేటాయిస్తే 1,125 మాత్రమే చేశారని, త్వరితగతిన కేటాయించిన లక్ష్యాలను సాధించాలని తహసీల్దార్లను ఆదేశించారు. పీఎం సూర్యఘర్‌కు సంబంధించి 80వేల రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు. వారితో మాట్లాడి రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జూన్ 10వ తేదీలోపు రోజుకు 250 ఇళ్లను పూర్తి చేయాలన్నారు. ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో 90 శాతం అర్జీలు రెవెన్యూ శాఖవే ఉంటున్నాయని తెలిపారు. తహసీల్దార్ల దగ్గరకు సమస్యలు రావడం లేదని, అన్నీ కలెక్టర్‌ట్‌కే వస్తున్నాయని, మండల స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తే కలెక్టరేట్‌కు ఎందుకు వస్తారనీ తహసీల్దార్‌లను ప్రశ్నించారు. జూన్ 5వ తేదీలోపు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను కూడా పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:31 AM