వైసీపీ కుట్రలను ప్రజలు నమ్మరు
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:57 AM
: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ, మాజీ సీఎం జగన ప్రాం తాల, మతాల, కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు చేస్తున్నారని, ప్రజలు వీటిని నమ్మరని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ, మాజీ సీఎం జగన ప్రాం తాల, మతాల, కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు చేస్తున్నారని, ప్రజలు వీటిని నమ్మరని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆరోపించారు. బుదవారం పట్టణంలోని ఆయా వార్డులకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు దాదాపు 2వేల మందికి పైగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బీవీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చు కున్నారు. వైసీపీకి చెందిన మున్సిపల్ కో-ఆప్షన మెంబర్ హసీనా, ఆమె భర్త గట్టు ఖాజా, వైసీపీ నాయకులు, ప్రముఖ సామజిక వేత్త మల్లెల ఆల్‌ఫ్రెడ్ రాజు ఆయన అనుచరులు, వైసీపీకి చెందిన నంబూరి సురేష్‌తో పాటు మరి కొందరు, తెలుగురాముడు ఆయన అనుచరులు, టౌన బ్యాంకు మాజీ డైరెక్టర్ శ్రీరాములు, పాత పదకొండో వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ లచ్చన్న, వైసీపీ నాయకులు వెంకటేష్, రవి, ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు కదిరికోట అనిల్ కుమార్, కదిరికోట శాంతరాజు, ఎంఎస్ నగర్‌కు చెందిన ఎంఆర్ మోహాన, మాల రాజేష్‌లతో పాటు వారి అనుచరులు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే స్వగృహానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే బీవీ సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు శ్రీరాములు, టీడీపీ నాయకులు రామదాసు గౌడ్, నరసింహులు, కాశీం వలి, ధర్మాపురం గోపాల్, కురువ మల్లయ్య, ముల్లా కలీముల్లా, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, అల్తాఫ్, రాజు, మహేష్, షాలేమ్, జయన్న, నరసన్న గౌడ్, కొండన్న గౌడ్, గుల్లా సలాం, కటారి రాజేంద్ర పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:57 AM