ప్రజలు సంతోషంగా ఉన్నారు
ABN, Publish Date - Aug 03 , 2025 | 12:42 AM
కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
జొహరాపురంలో ‘తొలిఅడుగు’
కర్నూలు అర్బన, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని జొహరాపురంలో సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఏఏ పథకాలు అందాయని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లికి వందనం డబ్బులు తల్లుల అంకౌంట్లలో జమ చేశామని, ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని, అర్హులందరికీ ప్రతి నెల 1వ తేదీనేి పింఛన్లు పంపిణి చేస్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేశామన్నారు. కార్యక్రమంలో లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ భట్, న్యాయవాదులు పాల్గొన్నారు.
Updated Date - Aug 03 , 2025 | 12:42 AM