వేరుశనగ ధర పతనం
ABN, Publish Date - May 12 , 2025 | 11:47 PM
వేరుశనగ ధరలు రోజు రోజుకి మరింత పతనమవుతున్నాయి. సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధర క్వింటా గరిష్ఠంగా రూ.5,939 పలికింది.
ఆదోని అగ్రికల్చర్, మే 12 (ఆంధ్రజ్యోతి): వేరుశనగ ధరలు రోజు రోజుకి మరింత పతనమవుతున్నాయి. సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధర క్వింటా గరిష్ఠంగా రూ.5,939 పలికింది. గతవారంతో వేరుశనగ ధరలను పోల్చితే క్వింటాకు రూ.600 పైగా ధర తగ్గింది. రబీలో బోరు బావుల కింద సాగైన వేరుశనగ పంట చేతికందడంతో రైతులు విక్రయానికి తీసుకొస్తున్నారు. ధరలు పతనం కావడంతో ఆందోళన చెబుతున్నారు. వేరుశనగ నాణ్యత లేకపోవడంతోనే ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు తెలిపారు. ఆదోని మార్కెట్‌కు సోమవారం 142 బస్తాల వేరుశనగ విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.3,659, గరిష్ఠ ధర రూ.5,939, సగటున రూ.5,690 పలికింది.
Updated Date - May 12 , 2025 | 11:47 PM