ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జమిలిపై పవన్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం

ABN, Publish Date - May 27 , 2025 | 11:33 PM

జమిలి ఎన్నికలపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ తమిళనాడులోని డీఎంకేతో మాట్లాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామక్రిష్ణ

సూపర్‌ సిక్స్‌ అమలలో కూటమి ప్రభుత్వం విఫలం

రైతుల ఖాతాల్లో రూ. 20వేలు జమ చేయాలి

జూన్‌2న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

కర్నూలు న్యూసిటీ, మే 27(ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికలపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ తమిళనాడులోని డీఎంకేతో మాట్లాడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. మంగళవారం చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా సూపర్‌ సిక్స్‌లో అమలులో విఫలమైందని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక నిత్యాసవర వస్తువుల ధరలు తగ్గించారా.. నిరుద్యోగం తగ్గిందా.. విదేశాల్లోని నల్లడబ్బును తెచ్చారా? అని ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో యుద్ధం ఎందుకు విరమించారో మోదీ సమాధానం చెప్పాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబితే యుదం విరమిస్తారా అని, దేశ పరువు ప్రతిష్టలు దిగజారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి మార్చుకోవాలని పీఎం మోదీని పొగు డ్తున్న ఈ విషయంపై డిబెట్‌కు రావాలన్నారు. రైతులకు ఇస్తామని పె ట్టుబడి కేంద్రంతో కలిపి రూ.20 వేలు వారి ఖాతాల్లో జమ చేయా లన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. జూన్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ అధ్వర్యంలో చేపట్టే ఆందోళన కార్యక్రమాలు విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, జిల్లా కార్యవర్గసభ్యులు కే.జగన్నాథం, జి.చంద్రశేఖర్‌, సహాయ కార్యదర్శులు సి.మహేష్‌, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:33 PM